హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న రోజా

CTR: YCP నాయకురాలు ఆర్కే రోజా మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తన సొంత నియోజకవర్గ (నగరి) ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు.