హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెట్టింపు నగదు ఆశ చూపిన పాస్టర్‌పై కేసు

ప్రకాశం: రెండు నెలల్లో నగదు రెట్టింపు చేస్తానని నమ్మబలికి రూ.కోట్లు వసూలు చేసిన పాస్టర్‌పై మర్రిపూడి PSలో కేసు నమోదైంది. వేమవరానికి చెందిన పాస్టర్ పురుషోత్తంతో పాటు ఆయన భార్య నిర్మల, కుమారులు సుకుమార్, దానియేల్, నవీన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.10–15 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.