హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

NDL: రుద్రవరం మండలం కొండమాయపల్లెకు చెందిన మహమ్మద్ యూసఫ్ (12) అదృశ్యమయ్యాడు. అరబిక్ పాఠశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో అక్టోబర్ 2న వెలగలపల్లె బస్టాప్ నుంచి బస్సులో నంద్యాలకు బయలుదేరాడు. అయితే పాఠశాలకు చేరుకోకపోవడంతో తండ్రి చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.