NDL: అవుకు రిజర్వాయర్ సమీపంలో ఉదయాన్నే నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తూ సందడి చేస్తున్నాయి. ప్రకృతి అందాల మధ్య నెమళ్ల నాట్యాన్ని పాదచారులు, వాకింగ్ ప్రియులు ఆస్వాదించారు. రిజర్వాయర్‌ను సందర్శించే పర్యాటకులకు జాతీయ పక్షి నెమళ్లు కనిపించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెమళ్ల అందాలు అవుకు రిజర్వాయర్‌కు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఉదయాన్నే నెమళ్ల నాట్యం.. కనువిందు


