హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోనగర్‌లో ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం

GNTR: ఆటోనగర్ వద్ద తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న ఎలక్ట్రికల్ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.