హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో దివి వైద్య

తిరుమల: సినీ నటి దివి వైద్య సన్నిహితులతో కలిసి ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రీ వేంకటేశ్వర వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు.