హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోపిదేవి నుంచి సోమనాథ్‌కు ఆధ్యాత్మిక యాత్ర

కృష్ణా: మోపిదేవి పుణ్యక్షేత్రం తరపున భక్తులకు సోమనాధ్ స్వాభిమాన్ యాత్ర ఏర్పాటు చేశారు. ఆదివారం మోపిదేవిలో దేవస్థానం వద్ధ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఈ బస్సు యాత్రను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్రకు పలు గ్రామాల నుంచి 30మంది భక్తులు బయలుదేరి వెళ్లారు.