W.G: ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ప్రముఖ యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తణుకు ఎన్జీవో హోంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. రోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. నేటి జీవనశైలి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి'


