హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి'

KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆమె.. పోలింగ్ కేంద్రాల వర్గీకరణ, రవాణా, ఎన్నికల సామగ్రి, శాంతిభద్రతలు, స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.