హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటల సాగు ఆధారంగా కరువు మండలాలు: కలెక్టర్

KRNL: జిల్లాలో కరువు మండలాల గుర్తింపులో వర్షపాతం, భూగర్భ జలాల మట్టం, పంటల సాగు వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, ఫిజోమీటర్లు, ఈ-క్రాప్, రిమోట్ సెన్సింగ్ డేటాను విశ్లేషించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 86 శాతం విస్తీర్ణంలో పంటల సాగు జరుగుతున్నందున కొన్ని మండలాలనే కరువు మండలాలుగా గుర్తించినట్లు వివరించారు.