PPM: సాలూరులో రూ.1 కోటి విలువైన బంగారం పోయిన మూడు గంటల్లోనే పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. సాలూరుకు చెందిన వ్యక్తి బ్యాంకు నుంచి బంగారం తెస్తుండగా తెలగవీధి వద్ద బ్యాగు పడిపోయింది. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, వెంటనే బంగారాన్ని గుర్తించి సురక్షితంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడికి బంగారం అప్పగించిన పోలీసులు


