హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 91,296 మంది భక్తులు దర్శించుకోగా.. 32,805 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారికి రూ.5.06 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.