RR: మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ దుస్తుల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్వరానికి చెందిన ఏలే రమేష్(48) దుస్తుల వ్యాపారంతో పాటు బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం సరిగా సాగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శనివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య


