BDK: ములకలపల్లిలో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వ్యక్తిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ప్రధాన సెంటర్‌లో కూరగాయలు కొనుగోలు చేసిన సాయిబాబా (55) స్కూటీ ఎక్కుతుండగా కాలు జారి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో టిప్పర్ అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


