హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవోదయ ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్నమయ్య: రాజంపేట మండలం నారమరాజుపల్లిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశ దరఖాస్తుల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్‌ అబ్దుల్‌ రహమాన్‌ తెలిపారు. ప్రస్తుతం 8, 11 తరగతులు చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.