హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మహిళ మృతి

GNTR: విశాఖపట్నం నుంచి గుంటూరు వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించలేదని తెలిపారు. జీఆర్పీ ఎస్సై దీపిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.