హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాక్టర్ నుంచి జారిపడి యువకుడు మృతి..!

NLR: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ గిరిజన యువకుడు ట్రాక్టర్ నుంచి జారిపడి మృతి చెందిన విషాద సంఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. శేషయ్య అనే గిరిజన యువకుడు ఇటుకలను బద్దెవోలులో దించి తిరిగి వస్తుండగా అదుపుతప్పి జారిపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు.