VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో ఇవాళ ఆరోగ్య మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం 3000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యోగ శిక్షకులు శిర వాసుదేవరావు పర్యవేక్షణలో ఈ ర్యాలీ జరిగింది. యోగ సభ్యులు పలు నినాదాలు చేస్తూ గజపతినగరంలోని పలు ప్రధాన వీధుల్లో ర్యాలీ జరిపారు. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆరోగ్య మహోత్సవ ర్యాలీ


