ATP: అనంతపురంలో ఈ నెల 2, 3వ తేదీల్లో నిర్వహించిన 38వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కుమ్మర సోనాక్షి సత్తా చాటింది. ఆలమూరులోని స్కేటింగ్ రింక్‌లో జరిగిన పోటీల్లో రింక్-4, రింక్-5 విభాగాల్లో రెండు రజత పతకాలు సాధించింది. ఇప్పటి వరకు 20 మెడల్స్ సాధించిననట్లు తల్లిదండ్రులు తెలిపారు. సోనాక్షిని కోచ్ నాగేంద్రతో పాటు పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సోనాక్షికి 2 రజత పతకాలు


