హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం

VZM: గజపతినగరం పట్టణంలో కల్కి భగవాన్ మందిరం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం శనివారం నాటికి 3000 రోజులు పూర్తయ్యాయని శిక్షకుడు సీర వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గణపతి కల్యాణ మండపంలో ఇవాళ ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యఅతిథిగా గంగచోళ్లపెంట పీఠాధిపతి యోగానంద, యోగా గురువులు పాల్గొంటారని తెలిపారు.