హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 6న జాబ్ మేళా

VSP: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6న విశాలాక్షినగర్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి నీలం గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9154117837 నంబర్‌ను సంప్రదించాలన్నారు.