హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: ఉంగుటూరు మండలంలో రూ.3.05 కోట్లతో చేపట్టనున్న ఏడు రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధిరపాడులో శంకుస్థాపన చేశారు. ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చాయనే కారణంతో ఏ గ్రామాన్నీ అభివృద్ధికి దూరం పెట్టబోమన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు పాల్గొన్నారు.