E.G: సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. తీర్పు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నామని, వైసీపీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే మున్సిపల్ ఎన్నికలు: మంత్రి


