కోనసీమ: రాజోలు మండలం తాటిపాకలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని రాజోలు పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల గంజాయితో పాటు సిగరెట్ బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సురేష్‌బాబు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్


