హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: RTO

కోనసీమ: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ సమీపంలో అమలాపురం ఆర్టీవో కె.వరప్రసాద్ శనివారం పలు వాహనాలను తనిఖీ చేశారు. జాతీయ రహదారిపై వెళ్లే టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాలను ఆపి వాటి రికార్డులను పరిశీలించారు. బస్సులు లోపల కూడా తనిఖీ చేసి, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులకు హెచ్చరించారు.