VSP: గాజువాక ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్-పేషెంట్ అటెండెంట్స్ వెయిటింగ్ హాల్‌ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం, మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రికి లభించిన పురస్కారాన్ని వైద్య అధికారులు ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలకు నాణ్యమైన వైద్యం'


