హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేట రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం నాబార్డ్ నిధులతో అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని కొత్తపేట నుంచి కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారి వరకూ రూ.55 లక్షలతో నిర్మించిన 484 మీటర్లు పొడవు 3.75 మీటర్లు వెడల్పుతో నిర్మించిన నూతన తారు రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.