KKD: పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాదగయ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్మశానవాటికలోని విశ్రాంత షెడ్ వద్ద సుమారు 55 ఏళ్ల వయసు గల పురుషుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు నీలం రంగులో తెలుపు అడ్డగీతల చొక్కా, నలుపు రంగు ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని, చేతిపై రాజు అనే పచ్చ బొట్టు ఉందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


