హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లులో భారీగా ప్లాస్టిక్ కవర్లు సీజ్

ATP: గుంతకల్లులో అక్రమంగా తరలిస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శనివారం సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. లక్ష రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని బొలెరో వాహనాన్ని సీజ్ చేశామన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు నిల్వ ఉంచిన, అక్రమంగా తరలించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.