హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షాకింగ్.. 10 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

TPT: జిల్లా రైల్వే కోడూరులో పదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. 45 ఏళ్ల వ్యక్తి బాలికను ఆటోలో రైల్వే స్టేషన్‌కు, అక్కడి నుంచి ఊరి బయటకు తీసుకెళ్లి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు బాలిక తల్లికి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.