హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన

KDP: వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఇన్‌చార్జ్ ఫారెస్ట్ రేంజర్ నయీం అలీ తెలిపారు. శనివారం సిద్ధవటంలోని ఓ పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా అడవుల ప్రయోజనాలు, వన్యప్రాణుల ప్రాధాన్యతను వివరించారు. అడవులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.