హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడలో స్కిల్ సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు

కాకినాడ జిల్లా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించడంతో పాటు స్టార్టప్ ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘స్కిల్స్, స్టార్టప్స్, భారత్ హబ్–స్కిల్ సెంటర్’ ఏర్పాటు కానుంది. కాకినాడ నగరంలోని ప్రభుత్వ ITI కళాశాల ప్రాంగణంలో కేంద్రానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.5.30 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు.