హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మెగా కార్డాన్ సెర్చ్

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో జిల్లాలో గంజాయి నిర్మూలన, నేర నియంత్రణే లక్ష్యంగా మెగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సుమారు 80 మంది పోలీసు అధికారులు పాల్గొని 350 ఇళ్ళలోను, బహిరంగ ప్రదేశాల్లోనూ ఆకస్మిక సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని 12 మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు.