హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగిలించిన బంగారు ఆభరణాలు రికవరీ

NTR: జిల్లా సెప్టెంబర్ 25న కొండపల్లిలో దామెల్ల లక్ష్మికి చెందిన బంగారు నాన్‌తాడు, తాళిబొట్టు ఉన్న గొలుసు చోరీకి గురైంది. ఫిర్యాదుతో సీఐ ఏ. సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు క్రైమ్ ఎస్‌ఐ సేనాపతి శ్రీనివాసరావు, సిబ్బంది దర్యాప్తు చేసి శనివారం ఆభరణాలను రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. సీఐ సుబ్రహ్మణ్యం క్రైం పోలీసులను అభినందించారు.