హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

ELR: రెవెన్యూ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తిని పెంచాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రీసర్వే, పాస్‌పుస్తకాలు, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.