హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పర్యటనకు రానున్న హోం మంత్రి

ATP: ఈ నెల 5న హోం మంత్రి వంగలపూడి అనిత అనంతపురం జిల్లాకు రానున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.