హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోషణతోనే మంచి ఆరోగ్యం..!

NLR: అల్లూరు పట్టణంలోని ప్రగతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ.. పౌష్టికాహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుందన్నారు. చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పాలు, తాజా ఆకుకూరలు, గుడ్డు, తినాలని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.