హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుర్రిపాలెంలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

GNTR: తెనాలి(M)బుర్రిపాలెంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో బుర్రిపాలెం చేరుకుని, 10.40 గంటలకు 3డీ హౌసింగ్ లబ్ధిదారుల స్థలానికి వెళ్లనున్నారు. అక్కడ హౌసింగ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, లబ్ధిదారులతో ముఖాముఖి, భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని 1.15 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.