హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో ప్రత్యేక ఆధార్‌ డ్రైవ్‌

GNTR: తాడేపల్లి 5వ వార్డులోని యానాది కాలనీలో శనివారం ప్రత్యేక ఆధార్‌ డ్రైవ్‌ నిర్వహించారు. తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త ఆధార్‌ నమోదు చేశారు. కార్డుల్లో వివరాల అప్‌డేట్‌, ఈ-కేవైసీ, బయోమెట్రిక్‌ సేవలు అందించారు. రేషన్‌ కార్డు సమస్యలను పరిష్కరించారు. అర్హులకు కుల ధ్రువీకరణ పత్రాల సేవలు కల్పించారు.