హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వినతి

ATP: గుత్తి పట్టణంలోని 327 సర్వేనెంబర్‌లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శనివారం కాలనీవాసులు, సీపీఎం నాయకులతో కలిసి గుత్తి, పామిడి మండలాల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు నిర్మలమ్మ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని, కాలనీలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.