హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటి కొళాయి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరంలో చేపట్టిన ఇంటింటికీ కుళాయి నీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.