హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డుపైనే మురుగునీరు.. ప్రజలకు ఇబ్బందులు

KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కనంపల్లి ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే మార్గంలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతుండగా, దోమలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.