హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. పరిశుభ్రతను పాటిద్దాం'

​PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటలో శనివారం 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా ఎం. ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించిన ఆయన, పరిసరాల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక వాణిజ్య, వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు.