సత్యసాయి: రాయలసీమ అభివృద్ధికి ఆర్‌డీటీ సంస్థ అందిస్తున్న సేవలు మరువలేనివని పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి కొనియాడారు. బీడుపల్లి హైస్కూల్‌లో ఆర్‌డీటీ సహకారంతో పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం, ఆర్‌డీటీ కృషి వల్ల ఈ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఐ అనుమతులు దక్కాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యారంగానికి ఆర్‌డీటీ సేవలు అనన్యసామాన్యం'


