హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

NDL: పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహించిన మీ ఇంటికి మీ భూమి హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే జయ సూర్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం రైతులకు రాజముద్రలతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు.