కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదేశాలతో జనుపల్లి, నల్లమిల్లిలో ఇరిగేషన్ అధికారులు డ్రైనేజీ సమస్యను శనివారం పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడంతో పాటు నూతన కల్వర్టు, వంతెన సమస్య పరిష్కారానికి అంచనాలు సిద్ధం చేస్తామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే


