KKD: తుఫాన్ ప్రభావంతో వరద ముంపునకు గురైన కాకినాడ భాను వారి వీధిలో శనివారం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చొరవతో మున్సిపల్ కమిషనర్, నగర హెల్త్ ఆఫీసర్ల సమన్వయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరద ముంపు నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వరద ముంపు ప్రాంతంలో మెగా వైద్య శిబిరం


