హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు'

VZM: ఖరీఫ్‌ 2026-27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జేసీ ఎస్. సేధు మాధవన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం 261 రైతు సేవా కేంద్రాలను క్లస్టరింగ్‌ అనంతరం ప్రతిపాదించినట్లు నివేదికలో పేర్కొన్నారు.