హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 6న మెగా రక్తదాన శిబిరం

ASR: ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవాసంఘం ఆధ్వర్యంలో ఈనెల 6న పాడేరు ఐటీడీఏ వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. యువత, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా సహకరించాలన్నారు. శనివారం జేసీ శ్రీపూజను విలేకరులు ఆహ్వానించారు.