హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శనేశ్వర స్వామికి ఘనంగా తైలాభిషేకాలు

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుండి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు వివిధ సేవలు ద్వారా రూ.3.21 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు.